రేపు గుంటూరుకు వైఎస్ జగన్

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరుకు వెళ్లనున్నారు. జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 23న గుంటూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు.

By అంజి
Published on : 22 Oct 2024 1:30 PM IST

YCP , YS Jagan, Guntur, APnews

రేపు గుంటూరుకు వైఎస్ జగన్ 

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరుకు వెళ్లనున్నారు. జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 23న గుంటూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. తెనాలికి చెందిన యువతి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు. ఓ వ్యక్తి కారణంగా అపస్మారక స్థితి­లోకి వెళ్లిన తెనాలికి చెందిన యువతిని బుధ­వారం ఉదయం వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నారు. బద్వేలులో అత్యాచారం, హత్యకు గురైన యువతి కుటుంబసభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నారు.

తాడేపల్లి నుంచి మొదట గుంటూరు జిల్లాకు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తారు. యువతిని పరామర్శించిన అనంతరం ప్రత్యేక విమానం ద్వారా వైఎస్సార్‌ జిల్లాకు చేరుకుంటారు. కడప విమానాశ్రయం నుంచి దిగి బద్వేలులో బాధిత యువతి కుటుంబసభ్యులను కలవనున్నారు.

Next Story