ఏపీలో మందుబాబులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
Wine Shops To Be Open Till 10 Pm in Andhrapradesh.మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
By తోట వంశీ కుమార్ Published on 18 Jan 2022 2:44 AM GMTమందుబాబులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మద్యం దుకాణాల పని వేళలను మరో గంట పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాలు రాత్రి 9 గంటల వరకే తెరిచి ఉంటున్నాయి. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉండనున్నాయి. బేవరేజెస్ కార్పొరేషన్ దుకాణాలు రాత్రి 10 వరకు నిర్వహణ ఉంటుందని ఆబ్కారీ శాఖ స్ఫష్టం చేసింది. మద్యం దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు సమయం పెంచినట్లు ఉత్వర్లుల్లో ప్రభుత్వం పేర్కొన్నారు.
ఇటీవల రాష్ట్రంలో మద్యంపై పన్ను రేట్లలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. వ్యాట్‌తో పాటు స్పెషల్ మార్జిన్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం క్రమబద్దీకరించింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్) రకం మద్యంపై 5 శాతం నుంచి 12 శాతం, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకు ధరలు తగ్గించింది. బీర్లపై వ్యాట్ 10 నుంచి 20 శాతం, స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ 36 శాతం తగ్గింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 2,934 మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మద్యపాన నిషేధం నేపథ్యంలో 4,380గా ఉన్న షాపుల సంఖ్య ప్రభుత్వం 33శాతం మేర తగ్గించింది. ప్రతి ఏడాది 20 శాతం మేర వైన్ షాపులను తగ్గిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.