ఈ జన్మలో టీడీపీలో చేరను: విజయసాయిరెడ్డి

తాను టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి ఖండించారు.

By అంజి
Published on : 26 Sept 2024 9:52 AM IST

TDP, YCP , Vijayasai Reddy, APnews

ఈ జన్మలో టీడీపీలో చేరను: విజయసాయిరెడ్డి

తాను టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి ఖండించారు. ''దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1 శాతం మాత్రమే ఇచ్చాడాయె! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందకపోవడంతో మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు. నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా నేను ఈ జన్మలో కులపార్టీ అయిన టీడీపీలో చేరను'' అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

''విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కులపార్టీ లో చేరేందుకు ప్రయత్నించానా? అచ్చెన్నా.. నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా. భ్రమల లోకంలో గెంతులేయాలనుకుంటే, గో...ఆన్...నిన్ను ఆపేదెవరు'' అని విజయసాయిరెడ్డి ఫైరయ్యారు. ముగ్గురు వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యులను సంతలో పశువుల్లాగా కొనుగోలుచేసి వారిచేత రాజీనామా చేయించిన చరిత్ర హీనుడు చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు అబద్ధాల పొదిలో ఎన్నో విషపు బాణాలుంటాయని అన్నారు.

Next Story