కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రావికంపాడు జంక్షన్ వద్ద రొయ్యల వ్యాన్‌ను తప్పించబోయి డీజిల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టడంతో 43 ఏళ్ల డ్రైవర్ Sk. కలాం సజీవ దహనం అయ్యాడు. మృతుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్‌కు చెందినవాడు. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంతో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకుని మంటలను అదుపు చేసింది.
అన్నవరం సబ్-ఇన్స్పెక్టర్ మరియు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి. శ్రీధర్ మాట్లాడుతూ.. “సర్వీస్ రోడ్డు నుండి అకస్మాత్తుగా హైవేపైకి వచ్చిన రొయ్యలతో నిండిన వ్యాన్‌ను తప్పించుకునేందుకు కలాం ప్రయత్నించినప్పుడు, కలాం నడుపుతున్న లారీ.. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. కలాం మృతదేహం లారీ లోపల కాలిపోయి కనిపించింది” అని అన్నారు. దీనిపై అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో దశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.