ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

ప్రకాశం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం బస్సు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది.

By అంజి  Published on  11 July 2023 2:08 AM GMT
Wedding bus,  Sagar canal, Prakasam district, APnews

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

ప్రకాశం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం బస్సు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. 19 మందికి చిన్న పాటి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దర్శి సమీపంలోని సాగర్‌ కాల్వలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనాస్థలిని ఎస్పీ మల్లికా గర్గ్‌ పరిశీఇంచారు. మృతులు పొదిలికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనలో అబ్దుల్ అజీస్ (65), అబ్దుల్ హాని (60), ముల్లా జానీ బేగం (65), ముల్లా నూర్జహాన్ (58),షేక్ రమిజ్ (48), షేక్ షాభినా (35), షేక్ హీనా (6) మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కాలువ సమీపంలోకి వచ్చేసరికి అదుపుతప్పి.. సైడ్ వాల్ కు తగలడం వల్ల కంట్రోల్ అవ్వక కాలువలోకి దూసుకుపోయిందని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ మాట్లాడారు. బస్సు వాల్‌కు కొట్టడంతో బస్సులోని ప్రయాణికులు ఒకరిమీద ఒకరు పడిపోయారని, ఆ తరువాత బస్సు కాలువలోకి దూసుకెళ్లే క్రమంలో.. బస్సుకింద క్రష్ అయి ఏడుగురు మృతి చెందారని తెలిపారు. తమకు సమాచారం అందగానే హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టామన్నారు.. దీనివల్ల చాలామందిని రక్షించగలిగాం. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు.

Next Story