అధికారంలోకి రాగానే పోలీసు నియామకాలు: లోకేష్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రాగానే పోలీసు నియామకాలు చేపడతామని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు.
By అంజి Published on 25 March 2024 7:08 AM GMTఅధికారంలోకి రాగానే పోలీసు నియామకాలు: లోకేష్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రాగానే పోలీసు నియామకాలు చేపడతామని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. పోలీసు నియామకాలన్నీ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. తాడేపల్లిలోని పైన్ ఉడ్ అపార్ట్‌మెంట్ వాసులతో నారా లోకేష్ భేటీ అయ్యారు. లోకేష్‌తో పాటు గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతాం అని వారికి హామీ ఇచ్చాను.
ఇదిలా ఉంటే.. మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. జగన్ పాలనలో దళితులు, మైనార్టీలు, బీసీలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గానికి చేసిన మోసాలు ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని, నియోజకవర్గం అభివృద్ధి కోసం తన వద్ద ఉన్న ప్రణాళికలు ప్రజలకు చెప్పానన్నారు.
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల కోసం జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పొత్తు పెట్టుకున్నాయి. టిడిపి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను 144, 25 ఎంపీ స్థానాలకు గాను 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో, ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది.