కూటమి ప్రభుత్వం హయాంలో నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,000 మంది అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరందరికీ నియామక పత్రాలను ఒకే వేదికపై అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, "మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 16,000 మంది ఉపాధ్యాయులకు త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తాము. ఈ కార్యక్రమానికి పులివెందుల ఎమ్మెల్యే జగన్‌ను కూడా ఆహ్వానిస్తాము" అని అన్నారు.