వారెవ్వా..లారీలో కూర్చుని పేకాట, వదల బొమ్మాలీ అంటూ పట్టించిన డ్రోన్

విజయనగరంలో కొందరు పేకాట రాయుళ్లు ఎవరికీ దొరకకుండా ఏకంగా లారీలో ప్లాన్ చేశారు.

By Knakam Karthik
Published on : 26 March 2025 5:50 PM IST

Andrapradesh, Vizianagaram police, people gambling in a lorry, help of a drone

వారెవ్వా..లారీలో కూర్చుని పేకాట, వదల బొమ్మాలీ అంటూ పట్టించిన డ్రోన్

విజయనగరంలో కొందరు పేకాట రాయుళ్లు ఎవరికీ దొరకకుండా ఏకంగా లారీలో ప్లాన్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో డ్రోన్లు డ్యూటీ చేస్తుండటంతో పేకాట రాయుళ్లు తమ ప్లాన్‌ను మార్చుకున్నారు. పార్క్ చేసిన లారీలో హాయిగా కూర్చుని పేకాట ఆడుతుండగా డ్రోన్ పట్టేసింది. దీంతో వాహనాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే లారీని చుట్టుముట్టారు. పేకాట రాయుళ్లు లారీ నుంచి దిగి పారిపోకుండా పోలీసులు అందులోకి ఎక్కారు. ఈ సీన్ మొత్తాన్ని డ్రోన్ కెమెరా రికార్డు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చెయ్యడానికి, నిర్మానుష్యమైన ప్రదేశాలలో నిఘా కోసం డ్రోన్​లను వినియోగిస్తున్నారు. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం. శాంతి భద్రతల విషయంలో డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్​ చేయిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.

కాగా ఇదే ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఎక్స్ వేదికగా స్పందించారు.. ఆమె ఇలా రాసుకొచ్చారు.." విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్.. అన్న నినాదానికి అర్ధం చెప్పిన ఘటన ఇది. ఎవరికీ దొరక్కుండా లారీలో పేకాడుతున్న వారిని విజయనగరం పోలీసులు డ్రోన్ సాయంతో గుర్తించి అరెస్ట్ చేశారు. టెక్నాలజీతో నేరాలను నియంత్రిస్తున్న పోలీసులకు అభినందనలు."అని హోంమంత్రి అనిత ట్వీట్ చేశారు.

Next Story