వైఎస్‌ వివేకా హత్య కేసు.. జగనన్న వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయి: సునీత రెడ్డి

Vivekanandareddy's daughter's sensational statement on YS Jagan. మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. తాజాగా సీబీఐకి వివేకా కూతురు సునీత రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన

By అంజి  Published on  28 Feb 2022 6:49 AM GMT
వైఎస్‌ వివేకా హత్య కేసు.. జగనన్న వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయి: సునీత రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. తాజాగా సీబీఐకి వివేకా కూతురు సునీత రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. '' మా నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసు, నాన్న హత్యపై భారతి, వైఎస్‌ జగన్ చాలా తేలిగ్గా స్పందించారు. నాన్న హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు బాధించాయి. హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెప్పాను. వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో అని అన్యాయంగా మాట్లాడారు. కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్‍కు ఏమీకాదు.. బీజేపీలో చేరతాడు. ఇప్పటికే మాపై 11 కేసులున్నాయి.. మీది 12వది అవుతుందని అన్నారని'' వివేకా కూతురు సునీత రెడ్డి వివరించారు.

తన తండ్రి హత్యను జగన్ రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారని సునీత అన్నారు. ఈ కేసు సీబీఐ విచారణ కోసం తాను కోర్టుకు వెళ్తే జగన్ రాజకీయ భవిష్యత్తు.. నాశనమయ్యే ప్రమాదం ఉందని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల అన్నారని గుర్తు చేశారు. అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిల డైరెక్షన్‍లో ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు. అవినాశ్‍రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్‍ రెడ్డిలతో పాటు మరికొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయని సునీత రెడ్డి పేర్కొన్నారు. నా తండ్రి అంటే ఎంపీ అవినాశ్‍కు గిట్టదని, హంతకులకు శిక్ష పడాలని.. గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించా సునీత రెడ్డి వెల్లడించారు.

Next Story