ఆంధ్రప్రదేశ్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న అవినాష్ రెడ్డి దర్యాప్తు ప్రక్రియకు అనుగుణంగా తన న్యాయవాదులతో కలిసి సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. మే 31న, తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం ఉదయం 10.30 నుండి సాయంత్రం 4.30 గంటల మధ్య సిబిఐ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
ఇప్పటికే పలుమార్లు సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి.. తల్లి ఆరోగ్యం బాగాలేదని, సీబీఐ విచారణకు రాలేనని పలుసార్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులకు లేఖలు రాశారు. అంతేకాకుండా అరెస్టు చేయకుండా ఉండేందుకు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దానిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. అవినాష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గత నెల మే 31న తీర్పు వెలువరించారు. ఈ మేరకు కోర్టు ఆదేశాలకు కట్టుబడి, హత్య కేసుకు సంబంధించి ప్రశ్నలను ఎదుర్కొన్న ఎంపీ విచారణలో పాల్గొన్నారు. విచారణలో సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.