విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  4 Aug 2024 12:30 PM IST
Visakhapatnam, fire accident,  railway station,

విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం 

విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది. రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌)లో మంటలు చెలరేగాయి. బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఆ ట్రైన్‌కు దూరంగా పరుగు తీశారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

విశాఖ రైల్వే స్టేషన్‌లో తిరుమల కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ వచ్చి ఆగింది. ఆ సమయంలోనే ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయని ప్రయాణికులు చెబుతున్నారు. ఏసీ బోగీలు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులను అధికారులు బయటకు పంపిస్తున్నారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం తెలసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా పొగ అలుముకుంది.

ఈ సంఘటనపై పోలీసు అధికారులు మాట్లాడారు. కోర్బా ఎక్స్‌ప్రెస్‌ ప్లాట్‌ఫామ్ నెంబర్‌ -4పైకి వచ్చి ఆగిన సమంయలో మంటలు చెలరేగాయని చెప్పారు. నాలుగు ఫైర్ టెండర్స్‌ ఘటనాస్థలానికి వచ్చి అదుపు చేశాయని వెల్లడించారు. దట్టమైన పొగ అలుముకోవడం వల్ల ప్రయాణికులు ఆందోళన చెందారని చెప్పారు. నాలుగు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. బీ6, బీ7, ఎం1 బోగీల్లో మంటలు వచ్చాయిని చెప్పారు. అయితే.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు రైలు ఆగి ఉన్న సమయంలో మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత తగ్గిందన్నారు.


Next Story