పర్యాటకానికి ప్రాధాన్యత.. విశాఖ సాగర్‌నగర్ బీచ్‌లో కొబ్బరి చెట్లు
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే
By అంజి Published on 28 Feb 2023 12:09 PM ISTవిశాఖ సాగర్‌నగర్ బీచ్‌లో కొబ్బరి చెట్లు
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాగర్‌బీచ్ ప్రాంతంలో 15 ఏళ్ల వయస్సు గల 200 కొబ్బరి చెట్లను నాటుతోంది. ''సన్‌రే రిసార్ట్‌లు, జీవీఎంసీ సమిష్టి కృషితో చేపట్టిన ఈ చర్య వేసవిలో బీచ్‌ని సందర్శించే పర్యాటకులకు నీడను అందించడంతోపాటు, ఆహ్లాద వాతావారణాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. జీవీఎంసీ ప్లాంటేషన్ డ్రైవ్ తర్వాత ఇసుకలో నాటిన మొక్కలు మంచి పరిమాణంలో పెరిగాయి. ఇది నిజంగా బీచ్‌లో పర్యాటకులను ఆకర్షిస్తుంది'' అని జీవీఎంసీ కమిషనర్ పి రాజాబాబు చెప్పారు.
''15 ఏళ్ల వయసున్న చెట్లను సరిగ్గా చూసుకోవాలి. సాధారణంగా తగిన పరిమాణంలో పెరిగిన చెట్లు పెకిలించిన వెంటనే చనిపోతాయి. ప్రత్యేక సాంకేతికతలతో, కార్మికులు ఇసుకలో నాటిన తర్వాత చెట్లను సురక్షితంగా, ఇంకా పెరిగేలా చూసుకుంటున్నారు'' అని ఆయన చెప్పారు. "సౌందర్యం కాకుండా కొబ్బరి చెట్లు బాటసారులకు, మార్నింగ్ వాక్ కోసం ఇక్కడికి వచ్చేవారికి, పగటిపూట బీచ్‌ని సందర్శించే పర్యాటకులకు కూడా నీడను అందిస్తాయి" అని పి రాజాబాబు చెప్పారు.
నగరాభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు భాగస్వామ్యులు కావాలని రాజాబాబు పిలుపునిచ్చారు. ఆర్‌కే బీచ్‌లో సందర్శకుల రద్దీని తగ్గించాలన్న ఉద్దేశంతో పలుచోట్ల బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జీ-20 సదస్సుకు వచ్చే అతిథులకు ఆహ్లాదం కల్పించేందుకు నగర సుందరీకరణ పనులను చేపట్టామని, విశాఖపట్నం ప్రపంచం దృష్టిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.