మధ్యంతర బెయిల్.. సస్పెన్స్ నవంబర్ 11 వరకూ!!

నకిలీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్ కోసం నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను విజయవాడ ఎక్సైజ్ కోర్టు వాయిదా వేసింది.

By -  Knakam Karthik
Published on : 6 Nov 2025 8:40 PM IST

Andrapradesh, Vijayawada, Excise Court, liquor case, interim bail

మధ్యంతర బెయిల్.. సస్పెన్స్ నవంబర్ 11 వరకూ!!

నకిలీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్ కోసం నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను విజయవాడ ఎక్సైజ్ కోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను నవంబర్ 11వ తేదీన చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న జనార్ధన రావు, జగన్మోహన రావు, ప్రదీప్, రవి, శ్రీనివాస రెడ్డి, కళ్యాణ్, శ్రీనివాస రావు, సతీశ్ కుమార్‌తో పాటు మరొకరు తమకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి, ఇరు పక్షాల వాదనలను విన్నారు. నిందితుల బెయిల్ పిటిషన్లపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని భవానీపురం ఎక్సైజ్ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నిందితులంతా నెల్లూరు కేంద్ర కారాగారంతో పాటు విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

Next Story