విజయవాడ ఈస్ట్: టీడీపీ ఎమ్మెల్యే రామమోహన్ హ్యాట్రిక్ కొడతరా.. వైసీపీకి చెందిన అవినాష్ సత్తా చాటుతారా?

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌కు ఈసారి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సిపికి చెందిన దేవినేని అవినాష్ నుండి గట్టి సవాలు ఎదురవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 March 2024 2:17 AM GMT
Vijayawada East, TDP, MLA Ramamohan, YCP, Avinash, APPolls

విజయవాడ ఈస్ట్: టీడీపీ ఎమ్మెల్యే రామమోహన్ హ్యాట్రిక్ కొడతరా.. వైసీపీకి చెందిన అవినాష్ సత్తా చాటుతారా?

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌కు ఈసారి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సిపికి చెందిన దేవినేని అవినాష్ నుండి గట్టి సవాలు ఎదురవుతోంది. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన గద్దె రామమోహన్‌ వైసీపీకి చెందిన దేవినేని అవినాష్‌పై పోటీపడనున్నారు. నియోజకవర్గం వివిధ సామాజిక, ఆర్థిక నేపథ్యాలకు చెందిన ఓటర్లను కలిగి ఉంది. అంతేకాకుండా, అవినాష్ తండ్రి దివంగత మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ అలియాస్ దేవినేని నెహ్రూ విజయవాడ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఉండేవారు.

గద్దె హ్యాట్రిక్ విజయం సాధించే అవకాశాలే ఉన్నాయి:

సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ నిస్సందేహంగా హ్యాట్రిక్ సాధిస్తారని రోజుకూలీ బి.హరికృష్ణ హామీ ఇచ్చారు. “రెండేళ్ళ క్రితం బెంజ్ సర్కిల్ వద్ద నేను ప్రమాదంలో చిక్కుకున్నాను. నేను ఒక నెల పాటు నా పనిని చేయలేకపోయాను. నా వైద్య పరిస్థితి గురించి తెలియజేసిన తర్వాత. ఎమ్మెల్యే తన ట్రస్టు నుంచి నా చికిత్సకు రూ.50వేలు అందించారు’’ అని తెలిపారు. ప్రజలను ఆదుకునేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రన్న భీమా ప్రవేశపెట్టారని హరికృష్ణ పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని విస్మరించి కార్మిక వర్గాన్ని తీవ్రంగా నష్టపరిచారని తెలిపారు.

వైఎస్‌ఆర్‌సీపీ సంక్షేమ కార్యక్రమాల గురించి అడగ్గా.. తన కుమార్తెకు రెండుసార్లు అమ్మ ఒడి వచ్చినా, అంతకు ముందు ఏడాది ఆర్థిక సాయం అందలేదని సమాధానమిచ్చారు. “మేము అధికారులను అర్జీ పెట్టుకున్నప్పుడు, నా కరెంటు బిల్లులు ఎక్కువగా ఉన్నందున నా బిడ్డ ఈ పథకానికి అర్హులు కాదని వారు తెలిపారు. ప్రభుత్వం హఠాత్తుగా మమ్మల్ని కార్యక్రమం నుంచి ఎలా తప్పించిందో తెలియాలి. కార్మిక, నిరుపేద వర్గాల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలో టీడీపీకి, విజయవాడ తూర్పులో గద్దె రామమోహన్‌కు మళ్లీ ఓటు వేస్తారు" అని తెలిపారు.

అవినాష్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌లో కీలక పాత్ర:

కృష్ణలంక వాసి వై.చిన్నారావు మాట్లాడుతూ.. టీడీపీ అభ్యర్థి గాదె రామమోహనరావు ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా.. దేవినేని అవినాష్ నిత్యం ఈ నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచారన్నారు. “ఉదాహరణకు.. సంవత్సరాలుగా, కృష్ణా నదిలో వరద నీటితో ఎన్నో ఇళ్ళు మునిగిపోవడం.. వరద రక్షణ ప్రహరీ గోడ లేకపోవడం వల్ల 30,000 నుండి 40,000 మంది ప్రజలు కృష్ణా లంక, ప్రక్కనే ఉన్న నివాస ప్రాంతాల నుండి పునరావాస కేంద్రాలకు తరలించవలసి వచ్చింది. " అని అన్నారు.

దశాబ్ద కాలంగా స్థానికులు కోరుతున్న రిటైనింగ్ వాల్‌ నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.125 కోట్లు మంజూరు చేసింది. ఇటీవల కనకదుర్గా వారధి వద్ద కృష్ణా నది పొడవునా 2.26 కిలోమీటర్ల మేర నిర్మించిన రిటైనింగ్ వాల్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అంతే కాకుండా నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు రివర్ ఫ్రంట్ వ్యూ పార్కును కూడా సీఎం జగన్ ప్రారంభించారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, రోడ్లు, డ్రెయిన్లు మరమ్మతులు చేయడం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు, అవినాష్ ప్రభుత్వ పథకాల ద్వారా సంక్షేమంపై దృష్టి సారించారు. నియోజకవర్గంలోని మహిళలు, యువకులు, వృద్ధుల అభ్యున్నతి కోసం తన ట్రస్టు నుంచి డబ్బును కూడా వెచ్చించారని ఆయన తెలిపారు.

వైఎస్‌ఆర్‌సీపీకి అనేక సంక్షేమ పథకాల వల్ల ప్రయోజనం:

రోడ్డు పక్కన వ్యాపారి డి.విజయలక్ష్మి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్లనే ప్రయోజనం ఉందన్నారు. "వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ అభివృద్ధి జరిగినా.. అమ్మ ఒడి, వైఎస్‌ఆర్‌ చేయూత, వైఎస్‌ఆర్‌ ఇబిసి నేస్తం ద్వారా మహిళలకు సాధికారత కల్పించారు. వైఎస్‌ఆర్‌ చేయూత కింద వరుసగా రెండేళ్లుగా రూ.18,750 వచ్చిందని, అది నా వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి దోహదపడింది" అని ఆమె అన్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే విజయావకాశాలపై విజయలక్ష్మిని ప్రశ్నించగా.. నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికైన గద్దె రామమోహన్ మంచి వ్యక్తి అని విజయలక్ష్మి బదులిచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత ఎమ్మెల్యే ప్రజలకు దూరమయ్యారు. గత రెండేళ్లలో నియోజకవర్గంలో రాజకీయ దృశ్యం వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారిందని ఆమె అన్నారు. గద్దె రామమోహన్‌కు ఓటర్లు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. అవినాష్‌కు కూడా ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాం. అవినాష్‌ను ప్రజలు సంప్రదించేవారని.. నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఇంటింటికీ వెళ్లి సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆమె తెలిపారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గం గురించి:

'విజయవాడ తూర్పు' విజయవాడ లోకసభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఇందులో విజయవాడ అర్బన్ (పాక్షికంగా), విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వార్డ్ నెం. 32, 36 నుండి 41, 45 నుండి 48, 50 నుండి 74 వరకు) ఉన్నాయి.

2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 275,655 మంది ఓటర్లు ఉన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కమ్మ, కాపు ఓటర్లు అధికంగా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గద్దె రామమోహనరావు రెండోసారి గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొప్పన భవకుమార్‌పై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి బత్తిన రాముడు 16.12 శాతం ఓట్లు సాధించారు. 1967, 1972, 1978, 1985, 1989, 1994 మరియు 2004లో ఈ సీటును కాంగ్రెస్ ఏడుసార్లు గెలుచుకుంది. 1983, 2014, 2019లో టీడీపీ మూడుసార్లు గెలిచింది. 1999 లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒకసారి గెలిచింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలుపొందింది.

ప్రముఖ రాజకీయ నాయకులు నాదెండ్ల భాస్కర్ రావు, వంగవీటి మోహన రంగా, ఆయన సతీమణి వంగవీటి రత్న కుమారి, ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ, అడుసుమిల్లి జై ప్రకాశరావు, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

Next Story