నేడు ఈడీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్న‌ విజయసాయి రెడ్డి

3,500 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి గురువారం హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నారు మాజీ YSRC నాయకుడు V. విజయ సాయి రెడ్డి.

By -  Medi Samrat
Published on : 22 Jan 2026 9:38 AM IST

నేడు ఈడీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్న‌ విజయసాయి రెడ్డి

3,500 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి గురువారం హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నారు మాజీ YSRC నాయకుడు V. విజయ సాయి రెడ్డి. కొన్ని రోజుల క్రితం, ఈ కేసులో మరింత సమాచారం కోరుతూ, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ హైదరాబాద్ విభాగం ఆయనకు సమన్లు ​​జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో YSRCP అధికారంలో ఉన్నప్పుడు మద్యం సరఫరాదారుల నుండి వసూలు చేసిన 3,500 కోట్ల నిధులను దారి మళ్లించారని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. ఆ స‌మ‌యంలో విజయ సాయి రెడ్డి కీలక పాత్ర పోషించారని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది, దీనితో ED దర్యాప్తు ప్రారంభమైంది.

Next Story