లోకేష్ తాను పప్పులకే పప్పని నిరూపించుకున్నాడు: విజయసాయి రెడ్డి

Vijayasai Reddy Comments On Nara Lokesh. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కుకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది. విశాఖ ఉక్కు

By Medi Samrat
Published on : 15 Feb 2021 3:15 PM IST

Vijayasai Reddy Comments On Nara Lokesh

ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కుకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు పార్టీలు నడుంబిగించాయి. విశాఖ ఉక్కు కోసం చేస్తున్న నిరసనలకు టీడీపీ నేత నారా లోకేష్ కూడా మద్దతు తెలిపారు. ఇక నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై విజయ సాయి రెడ్డి సెటైర్లు వేశారు. నారా లోకేశ్ అజ్ఞానంతో ప‌లు వ్యాఖ్య‌లు చేశారంటూ విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. టీడీపీ పుట్టింది 1982లో అయితే, 1978లోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను టీడీపీ అడ్డుకుందని ఆయ‌న అంటున్నార‌ని చుర‌క‌లంటించారు.

'లోకేశ్‌ తాను పప్పులకే పప్పని నిరూపించుకున్నాడు. 1978లోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను టీడీపీ అడ్డుకుందట. ఉద్యమాలు చేసిందట! టీడీపీ పుట్టింది1982లో కదా చిట్టీ? అవునులే, మీ నాన్న స్వతంత్ర పోరాటం చేశానని చెప్పుకున్నాడు. నీవు 78లోనే విశాఖ ఉక్కు కోసం పోరాడే ఉంటావు!' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.


అంతకుముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమ్మడానికి వాడెవ్వడు? కొనడానికి వీడెవ్వడు? అంటూ మండిపడ్డారు. పోస్కో,గోస్కో అని వస్తే చర్మం ఒలుస్తామని హెచ్చరించారు. 30 వేల మంది ప్రత్యక్షంగా,లక్ష మంది పరోక్షంగా ఆధారపడిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందన్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తుంటే 151 మంది ఎమ్మెల్యేలు,28 ఎంపీలు గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు. కేంద్రాన్ని నిలదీసే దమ్ము జగన్ కు లేదని విమర్శించారు.


Next Story