అమరావతి: విజయ, సంగం పాల ధరలను లీటర్‌కు రూ.2 పెంచుతున్నట్టు ఆయా డెయిరీలు తెలిపాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. పాల ఉత్పత్తి తగ్గడం, ప్యాకింగ్, డిజీల్, ఇతర ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి.
దేశంలోని అన్ని పాల యూనియన్లు ధరలు పెంచాయని, తాము కూడా ధరలు పెంచడం తప్ప లేదని తెలిపాయి. విజయ గోల్డ్ పాల ధర ప్రస్తుతం లీటర్ రూ.74 ఉండగా.. రూ.76 కానుంది. అలాగే టోన్డ్ మిల్క్ పెరుగు ప్యాకెట్ (900 గ్రాములు) రూ.62 నుంచి రూ.64కు పెరగనుంది.
నెలవారీ పాలకార్డు ఉన్న వారికి ఈ నెల 8 వరకు పాత ధరలే వర్తిస్తాయని తెలిపింది. స్డాండర్డ్ పాల ధర రూ.62 నుంచి 64, టోన్డ్ పాల ధర రూ.58 నుంచి 60, డబుల్ టోన్డ్ రూ.54 నుంచి 56 పెంచారు. అలాగే హోమోజినైజ్డ్ ఫుల్ క్రీమ్ మిల్క్ లీటరు రూ.68 నుంచి 72, టీ మేట్ రూ.68 నుంచి 70 పెరగనుంది. ఆవుపాలు లీటరు రూ.54 నుంచి 56, టోన్డ్ మిల్క్ పెరుగు ప్యాకెట్(450 గ్రాములు) రూ.32 నుంచి 33 పెంచారు.