వల్లభనేని వంశీకి నో రిలీఫ్, మళ్లీ రిమాండ్ పొడిగింపు..ఎప్పటివరకంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో షాక్ తగిలింది.
By Knakam Karthik
వల్లభనేని వంశీకి నో రిలీఫ్, మళ్లీ రిమాండ్ పొడిగింపు..ఎప్పటివరకంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో షాక్ తగిలింది. దళిత యువకుడి కిడ్నాప్ కేసులో ఊరట లభించలేదు. తాజాగా, విజయవాడ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం వంశీకి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగించింది.
గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే సత్యవర్ధన్ అనే దళిత యువకుడి కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ జైలోల్ వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల కోర్టు వంశీకి ఈ నెల 25 వరకు రిమాండ్ విధించగా, అది నేటితో ముగిసింది. దాంతో, వంశీని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. మరోవైపు, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనూ వంశీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో వంశీకి సీఐడీ కోర్టు మార్చి 28 వరకు రిమాండ్ విధించింది.
మరో వైపు వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి.. దీంతో, తీర్పు రిజర్వ్ చేసింది సీఐడీ కోర్టు.. అయితే, వల్లభనేని వంశీ బెయిల్‌పై ఈ నెల 27వ తేదీన తీర్పు ఇవ్వనుంది సీఐడీ న్యాయస్థానం.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలంటూ సీఐడీ కోర్టును ఆశ్రయించారు వంశీ.. మరోవైపు వంశీకి బెయిల్ ఇవ్వద్దని.. అతడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న కోర్టులో వాదనలు వినిపించారు సీఐడీ తరపు న్యాయవాది.. ఇక, ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది.