వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు..ఎప్పటివరకంటే?
వంశీ రిమాండ్‌ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు పొడిగించింది.
By Knakam Karthik
వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు..ఎప్పటివరకంటే?
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. టీడీపీ ఆఫీసులో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టు అయిన వంశీ రిమాండ్‌ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియనుండటంతో జైలు నుంచే వల్లభనేని వంశీని వర్చువల్‌గా జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి మార్చి 11 రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని మూడు రోజుల కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. జైలు వద్దకు పటమట పోలీసులు చేరుకుని వంశీని భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో వైద్య పరీక్షలకు తరలించారు. ఆయన్ను విజయవాడ పోలీసులు తరలించారు. కాగా సత్యవర్ధన్ స్టేట్‌మెంట్ ఆధారంగా వల్లభనేని వంశీని పోలీసులు విచారించనున్నారు.
కాగా టీడీపీ ఆఫీసులో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో వంశీ అరెస్టు అయిన విషయం తెలిసిందే. కాగా నిన్న ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్ ఆయనను 3 రోజుల కస్టడీకిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించాలంటూ ఆదేశించింది. విజయవాడ లిమిట్స్ లోనే కస్టడీలోకి తీసుకొని విచారించారంటూ ఆదేశాల్లో పేర్కొంది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలంటూ స్పష్టం చేసింది.