హైకోర్టులో ఖాళీలు.. ఎన్ని పోస్టులు అంటే..!

Vacancies in the High Court. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో18, తెలంగాణలో 10 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2021 5:17 AM GMT
Vacancies in the High Court

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 18, తెలంగాణలో 10 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. బుధవారం లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులకు 19 మంది... తెలంగాణ హైకోర్టులో 24 మందికి 14 మంది పని చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఉన్నత న్యాయస్థానానికి.. 2019లో ఇద్దరు, తెలంగాణలో ముగ్గురు, 2020లో ఏపీకి ఏడుగురు, తెలంగాణకు ఒక న్యాయమూర్తి నియామకం జరిగినట్లు చెప్పారు.

సుప్రీం కోర్టులోనూ 4 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల్లో కలిపి 39 % న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. ఏపీలోని కిందిస్థాయి న్యాయస్థానాల్లో 2020లో 97, తెలంగాణలో 96 న్యాయాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ సభ్యురాలు జోత్య్స చంద్రస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బుధవారం లోక్‌సభలో ఈ సమాధానమిచ్చారు.


Next Story