అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్...
By - అంజి |
అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు, ఉన్నతాధికారులు, బ్యాంకులు, బీమా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. అంతకుముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతికి మరింత ఆర్థిక సాయం అందించాలని కోరారు.
కాగా తాజాగా శంకుస్థాపన చేయబడిన 15 ఆర్థిక సంస్థల కార్యాలయాల ఏర్పాటు ద్వారా రూ.1,328 కోట్ల పెట్టుబడులు రాజధాని అమరావతికి రానున్నాయని, 6,514 ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఏపీసీఆర్డీఏ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ (APCOB), బ్యాంకు ఆఫ్ ఇండియా (BOI), కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI), యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా (UBI), బ్యాంకు ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు, జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (NABARD), పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (IOB), IDBI బ్యాంకు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC),న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) కార్యాలయాల నిర్మాణాన్ని ₹1,334 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు.