విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే నిరంతర సరఫరా: మంత్రి గొట్టిపాటి రవికుమార్

విజయవాడలో రూ.30 కోట్లతో నిర్మించిన ఏపీ సీపీడీసీఎల్ (APCPDCL) కొత్త కార్పొరేట్ కార్యాలయం 'విద్యుత్ నిలయం'ను రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం ప్రారంభించారు

By -  Knakam Karthik
Published on : 8 April 2026 4:19 PM IST

AndhraPradesh, GottipatiRaviKumar, APCPDCL, VidyutNilayam, APEnergyDepartment, NoPowerHike

విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే నిరంతర సరఫరా: మంత్రి గొట్టిపాటి రవికుమార్

విజయవాడలో రూ.30 కోట్లతో నిర్మించిన ఏపీ సీపీడీసీఎల్ (APCPDCL) కొత్త కార్పొరేట్ కార్యాలయం 'విద్యుత్ నిలయం'ను రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే రాష్ట్రంలో నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ను ఎన్డీయే కూటమి ప్రభుత్వం అందిస్తోందని స్పష్టం చేశారు.

మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించామని, లో-వోల్టేజీ సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున సబ్-స్టేషన్లను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరుగుతోందని వెల్లడించారు. ముఖ్యంగా వరదల సమయంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు అహర్నిశలు శ్రమించి సేవలందించారని వారిని అభినందించారు. 'పీఎం సూర్య ఘర్', 'పీఎం కుసుమ్' వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలోనూ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

Next Story