శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ప్రారంభం, భక్తులందరికీ అలంకార దర్శనం
నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
By Knakam Karthik
శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ప్రారంభం, భక్తులందరికీ అలంకార దర్శనం
నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీమల్లికార్జున స్వామివార్లకు విశేషార్చనలు నిర్వహించనున్నారు. మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు వాహనసేవలు జరుగనున్నాయి నేటి నుండి ఈ నెల 31 వ తేదీ వరకు 5 రోజులపాటు జరిగే ఉగాది మహోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీస్వామివారి యాగశాల ప్రవేశం చేసి ఆలయ అర్చకులు,వేదపండితులు, ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు దంపతులు ఘనంగా ప్రారంభించారు.
ముందుగా అర్చకులు, వేదపండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతిపూజ,శివసంకల్పం,చండీశ్వరపూజ,కంకణాధారణ,అఖండ దీపారాధన,వాస్తు పూజ,వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి ఉగాది మహోత్సవాకు వైభవంగా శ్రీకారం చుట్టారు. అయితే కన్నడ భక్తుల సౌకర్యార్థం ఈ నెల 16తేది నుండి నిన్నటి 26 తేది వరకు 4 విడతలుగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కలిపించిన ఆలయ ఈవో శ్రీనివాసరావు ఈరోజు ఉగాది మహోత్సవాలు ప్రారంభం కావడంతో నేటి నుండి ప్రతి ఒక్క భక్తునికి సౌకర్యవంతమైన దర్శన కల్పన కోసం అలానే భక్తులు త్వరగతిన దర్శనం చేసుకునేందుకు శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు అన్నారు. మరో వైపు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఇప్పటికే కన్నడ భక్తులకు క్షేత్రంలో పలుచోట్ల చలువ పందిళ్లు షామియానాలు త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు