మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి జ్యూడిషియల్ రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. ఉదయ్ కుమార్ రెడ్డికి గతంలో కోర్టు విధించిన రిమాండ్ బుధవారంతో ముగిసింది. దీంతో ఉదయ్ కుమార్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం ఉదయ్ కుమార్ రెడ్డికి మే 10వ తేదీ వరకు జ్యూడిషయల్ రిమాండ్‌ను పొడిగించింది. దీంతో ఉదయ్ కుమార్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ పై బుధవారం నాడు వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై రేపు తీర్పు ఇవ్వనుంది తెలంగాణ హైకోర్టు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ అధికారులు పిటిషన్ ను దాఖలు చేశారు. 2022 నవంబర్ 14న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత ఈ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది తెలంగాణ హైకోర్టు.