AP: ఇద్దరిని తొక్కి చంపిన ఏనుగులు.. కరెంట్‌ షాక్‌తో నాలుగు ఏనుగులు మృతి

తమిళనాడు సరిహద్దు సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగులు ఇద్దరు వ్యక్తులను తొక్కి చంపాయి. కుప్పం మండల పరిధిలోని

By అంజి  Published on  12 May 2023 12:45 PM IST
elephants, Chittoor, Four elephants died, electric shock

AP: ఇద్దరిని తొక్కి చంపిన ఏనుగులు.. కరెంట్‌ షాక్‌తో నాలుగు ఏనుగులు మృతి

తమిళనాడు సరిహద్దు సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగులు ఇద్దరు వ్యక్తులను తొక్కి చంపాయి. కుప్పం మండల పరిధిలోని మల్లనూరు, సప్పనికుంట గ్రామాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో మృతి చెందారు. రెండు ఏనుగులు దాడి చేయడంతో ఉష అనే మహిళ మృతి చెందింది. ఆమె మల్లనూరు రైల్వే స్టేషన్‌కు వెళుతోంది. సప్పనికుంటకు చెందిన శివలింగం అనే రైతు కూడా పొలాల నుంచి ఇంటికి వస్తుండగా ఎనుగు వెంబడించి తొక్కడంతో మృతి చెందాడు. గురువారం తెల్లవారుజామున మానవ నివాసాల సమీపంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వారం రోజుల క్రితం ఓ రైతును చంపిన ఏనుగులు.. తమిళనాడు నుంచి ఏపీ సరిహద్దులోకి ప్రవేశించాయి. తమిళనాడు అటవీ శాఖ సిబ్బంది ఏనుగులను పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ వైపు తరిమికొట్టారు. చిత్తూరు జిల్లాలో గతేడాది ఏనుగుల గుంపు ముగ్గురిని చంపింది. తమిళనాడు నుంచి ఏనుగులు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి.

ఇదిలా ఉంటే.. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ షాక్‌తో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. మరో రెండు ఏనుగులు తృటిలో ప్రమాదం తప్పించుకున్నాయి. భామిని మండలం కాట్రగడ్డ సమీపంలోని పొలాల్లో ఈ ఘటన జరిగింది. తివ్వాకొండల పై నుంచి ఓ ఏనుగుల గుంపు బొకన్న చెరువులో నీరు తాగేందుకు వచ్చింది. అక్కడే పొలాల్లో కొంత సేపు మేసిన తర్వాత.. అక్కడే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను నాలుగు ఏనుగులు తాకాయి. దీంతో అవి అక్కడిక్కడే చనిపోయాయి. చనిపోయిన వాటిలో ఒక పిల్ల ఏనుగు, మూడు పెద్ద ఏనుగులు ఉన్నాయి. నాలుగు ఏనుగులు చనిపోయిన తర్వాత గుంపులోని రెండు ఏనుగులు.. చాలా సేపు అక్కడే ఉన్నాయి.

Next Story