స్నానానికి వెళ్లి బావిలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలోని భామిని మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భామిని మండలం కోటకొండ గిరిజన చెందిన కీర్తి (12), అంజలి (13) అనే ఇద్దరు బాలికలు విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. కరోనా కారణంగా సెలవులు కావడంతో ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నారు. శుక్రవారం వీరిద్దరూ స్నానం చేసేందుకు గ్రామంలో ఉన్న ఓ నేలబావి దగ్గరకు వెళ్లారు.
అయితే.. వీరిద్దరూ స్నానానికిగి దిగినప్పుడు ఎవ్వరూ వీరిని చూడలేదు. బాలికలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. గ్రామస్థుల సాయంతో వెతికారు. ఈ క్రమంలో బావిలో బాలికల మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బావిలోంచి బాలికల మృతదేహాలను వెలికితీయించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భామిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందినట్లు ఉంటారని బావిస్తున్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు బాలికలు నీటిలో పడి మృతిచెందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.