Vizianagaram: చెట్టును ఢీకొన్న మినీ వ్యాన్.. ఇద్దరు మృతి
విజయనగరం జిల్లా గజపతినగరంలో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో మినీ వ్యాన్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఒడిశాలోని రాయగడ నుండి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విశాఖపట్నంకు చెందిన పొట్నూరు వినయ్‌కుమార్, దినేష్ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.