ప్రకాశం జిల్లా బేస్తవారి పేట మండలం పెద్ద ఓబినేనిపల్లెలో తీవ్ర విషాదం జరిగింది. క్రికెట్ ఆడుతుండగా పిడుగుపాటుకు గురై ఆకాశ్ (18), సన్నీ (17) అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో బాధితుడిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు యువకులు మృతి ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆకాష్, తన్ని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.