కాలువలోకి దూసుకువెళ్లిన కారు.. ఇద్ద‌రి మృతి.. ఓ వ్య‌క్తి గ‌ల్లంతు

Two dead as car plunges into canal.తూర్పుగోదావ‌రి జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. అదుపుత‌ప్పి ఓ కారు కాలువ‌లోకి దూసుకెళ్లింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 March 2021 3:56 AM GMT
Two dead as car plunges into canal

తూర్పుగోదావ‌రి జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. అదుపుత‌ప్పి ఓ కారు కాలువ‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెంద‌గా.. ఓ వ్య‌క్తి గ‌ల్లంత‌య్యాడు. మ‌రో ఇద్ద‌రు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఆత్రేయ‌పురం మండ‌లం లొలాకుల వ‌ద్ద జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. ప‌శ్చిమగోదావ‌రి జిల్లా పాల‌కోడేరు మండ‌లం గొల్ల‌ల‌కోడేరుకు చెందిన సురేష్ వ‌ర్మ‌(36), శ్రీనివాస్‌రాజ్‌(46), వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ‌రాజు, వెంక‌ట‌గ‌ణ‌ప‌తి రాజు, సీతారామ‌రాజు ఓకే అపార్టుమెంట్‌లో నివ‌సిస్తున్నారు. మ‌హాశివరాత్రి సంద‌ర్భంగా వీరంతా ఆత్రేయపురం మండలం వసంతవాడ తీర్థానికి వెళ్లారు.

అనంర‌తం తిరిగి తెల్ల‌వారుజామున వీరంతా కారులో వారి ఇంటికి బ‌య‌లుదేరారు. తొల్లాకుల మ‌లుపు వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి మంచు కార‌ణంగా కారు అదుపుత‌ప్పి కాలువ‌లోకి దూసుకెళ్లింది. వెంక‌ట‌గ‌ణ‌ప‌తిరాజు, సీతారామ‌రాజు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డగా.. మిగిలిన ముగ్గురు గ‌ల్లంత‌య్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. సురేష్ వ‌ర్మ‌, శ్రీనివాస్‌రాజుల మృత‌దేహాలు ల‌భ్యం అయ్యాయి. వెంక‌ట‌స‌త్య‌నారాయ‌ణ రాజు కోసం ముమ్మ‌రంగా గాలిస్తున్నారు.


Next Story
Share it