విశాఖ జిల్లా సీలేరు న‌దిలో రెండు నాటుప‌డ‌వ‌లు ప్రమాదానికి గురి అయ్యాయి. రెండు ప‌డ‌వ‌లు నీట మునిగాయి. ఈ ప్ర‌మాదంలో 8 మంది గ‌ల్లంత‌య్యారు. వారిలో.. ఓ చిన్నారి మృతదేహ‌తం ల‌భ్యమైంది. ఈ ప్ర‌మాదం నుంచి ముగ్గురు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ముగ్గురు నీటిలో ఈదుకుంటూ సుర‌క్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన మల్కాన్‌గిరి జిల్లా కెందుడుగ వద్ద సోమవారం అర్ధరాతి చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి ఒడిశా వెళ్లేందుకు నాటుపడవలో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో రెండు నాటుపడవల్లో 20 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ వలస కూలీలుగా సమాచారం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి కూలీలు స్వగ్రామాలకు వెళ్తున్నట్లు సమాచారం. గల్లంతైన కూలీలు గుంటవాడ, కెందుగుడకు చెందిన వారిగా గుర్తించారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు అక్క‌డికి చేరుకున్నారు. గ‌ల్లంతైన ఏడుగురి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story