శ్రీశైలం ఫారెస్ట్ ఏరియాలో విధి నిర్వహణలో ఉన్న అధికారులపై ఘర్షణకు దిగి, దాడికి పాల్పడిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో శ్రీశైలం జనసేన ఇన్‌చార్జ్ అశోక్ రౌత్‌ను పోలీసులు ఏ-1గా చేర్చారు. సీసీటీవీ ఫుటేజీలో దాడి చేస్తూ కనిపించిన టీడీపీ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డని ఏ-2గా చేర్చారు. కాగా ఈ కేసులో జనసేన నేతను చేర్చడంపై చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌కు ఫారెస్ట్ అధికారులు, అసోసియేషన్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అందులో జనసేన ఇంఛార్జి అశోక్ రౌత్ , ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి లపై 115(2),127(2),351(2),132 r/w ,3(5) BNS act సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.