తిరుమల అన్నప్రసాదంపై కామెంట్స్..శివజ్యోతికి టీటీడీ షాక్ ఇచ్చిందా?

తిరుమల అన్నప్రసాదం పంపిణీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారని వైరల్ కావడంతో యాంకర్ శివజ్యోతిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

By -  Knakam Karthik
Published on : 27 Nov 2025 6:55 AM IST

Andrapradesh, TTD, Anchor Shivajyothi

తిరుమల అన్నప్రసాదంపై కామెంట్స్..శివజ్యోతికి టీటీడీ షాక్ ఇచ్చిందా?

తిరుమల అన్నప్రసాదం పంపిణీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారని వైరల్ కావడంతో యాంకర్ శివజ్యోతిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. శివజ్యోతి భవిష్యత్‌లో శ్రీవారి దర్శనం చేసుకోకుండా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కాగా తిరుమల క్యూలైన్లో అన్న ప్రసాదంపై చేసిన కామెంట్స్‌తో చిక్కుకున్న సంగతి తెలిసిందే. క్యూలైన్లో ఉండగా... 'ప్రసాదం అడుక్కుంటున్నాడు. రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం' అంటూ నవ్వుతూ వీడియో చేయడంపై భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు రాగా ఆమె స్పందించారు. సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు.

తిరుమల లడ్డు ప్రసాదంపై తాను, తన సోదరుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్పష్టతనిస్తూ క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేసింది. తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని శివజ్యోతి కోరింది. తనకు తిరుమల వెంకటేశ్వరుడిపై అపారమైన భక్తి, అభిమానం ఉందని పేర్కొంది.

Next Story