చిరుత సంచారం.. అలిపిరి మార్గంలో ఆంక్షలు

చిరుత సంచారం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గం గుండా వేళ్లే వారి రక్షణ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆంక్షలు విధించింది.

By అంజి  Published on  17 Feb 2025 6:30 AM IST
TTD, Tirumala, Alipiri route, cheetah

చిరుత సంచారం.. అలిపిరి మార్గంలో ఆంక్షలు

అమరావతి: చిరుత సంచారం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గం గుండా వేళ్లే వారి రక్షణ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆంక్షలు విధించింది. ఈ మేరకు తిరుమల కొండపైకి వెళ్లే భక్తులకు అధికారులు పలు సూచనలు చేశారు. తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యథావిధిగా అనుమతి ఇస్తున్నారు. అనంతరం 70 నుంచి 100 మందితో గుంపులుగా వెళ్లేలా సిబ్బంది చర్యలు చేపట్టారు. 12 ఏళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు. రాత్రి 9.30 గంటల తర్వాత అలిపిరి మార్గాన్ని అధికారులు మూసివేస్తున్నారు.

చిరుత సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. విజిలెన్స్‌ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశించాల్సిందిగా టీటీడీ కోరింది. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియజేశామనీ, అయినప్పటికీ ఇటీవల కొంత మంది భక్తులు తమకు కేటాయించిన సమయాని కంటే ముందే క్యూలైన్ల వద్దకు వెళ్లి లోపలికి అనుమతించాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగారని టీటీడీ తెలిపింది.

Next Story