తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది.

By అంజి  Published on  4 Dec 2024 1:09 AM GMT
TTD, Tirumala, Srivari devotees, Laddus

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌

అమరావతి: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనం చేసుకున్నవారికి ఒక చిన్న లడ్డూ ఉచితంగా ఇస్తున్నారు. కానీ అదనంగా కొనేందుకు భక్తులు మొగ్గుచూపుతుండటంతో ఎక్కువ లడ్డూలు తయారు చేయించాలని టీటీడీ భావిస్తోంది. ఇందుకు పోటు సిబ్బందిని నియమించనుంది. ఇప్పుడు ఉన్నవారు కాకుండా మరో 74 మంది శ్రీవైష్ణవులతో పాటు ఇంకో 10 మంది ఇతరులను తీసుకోనుంది.

తిరుమలలో సాధారణ రోజుల్లో ఇబ్బందులు లేకున్నా వారాంతాలు, పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డూలకు డిమాండ్‌ అధికంగా ఉంటోంది. ప్రస్తుతం టీటీడీ ప్రతి రోజూ 3.5 లక్షల చిన్న లడ్డూలు, ఆరు వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేస్తోంది. తిరుమలతో పాటు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ స్వామి వారి లడ్డూలను విక్రయిస్తున్నారు. ఇకపై మరో 50 వేల చిన్న లడ్డూలు తయారు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

Next Story