పిఠాపురం నుంచి ట్రాన్స్‌జెండర్ తమన్నా పోటీ.. ఏకంగా పవన్‌ కల్యాణ్‌పైనే..

వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ తరపున ట్రాన్స్‌జెండర్ వ్యక్తి సింహాద్రి తమన్నా పోటీ చేయనున్నారు.

By అంజి  Published on  10 April 2024 6:58 AM IST
Transgender Tamanna, Pithapuram, APPolls

పిఠాపురం నుంచి ట్రాన్స్‌జెండర్ తమన్నా పోటీ.. ఏకంగా పవన్‌ కల్యాణ్‌పైనే..

పిఠాపురంలో రాజకీయాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ తరపున బిగ్‌బాస్‌ ఫేమ్‌, ట్రాన్స్‌జెండర్ వ్యక్తి సింహాద్రి తమన్నా పోటీ చేయనున్నారు. సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతరులకు వ్యతిరేకంగా తమన్నా ఎన్నికల్లో పోరాడనుంది. 2019 ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ట్రాన్స్‌జెండర్ తమన్నా పోటీ చేశారు. పిఠాపురం నుంచి తమన్నా పోటీ చేస్తున్నట్లు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌ ప్రకటించారు.

ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రచార ఇన్‌ఛార్జిగా ఆకుల జయ కళ్యాణి వ్యవహరించనున్నారు. కాగా, తమన్న సింహాద్రి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారేమీ కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి నారా లోకేశ్‌పై పోటీ చేసింది. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్‌కు ఎలాంటి గతి పట్టిందో పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్‌కు అదే గతి పడుతుందనే వ్యాఖ్యలు మొదలయ్యాయి. కాగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నినియోజకవర్గానికి చెందిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి సినీరంగంలో అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చింది. తనకు ఉన్న కాంటాక్ట్స్‌ ద్వారా బిగ్‌బాస్‌ రియాల్టీ షోలోకి వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఈ షోతో మంచి పేరు తెచ్చుకుంది.

Next Story