హిజ్రాల గ్యాంగ్ లీడర్ హాసిని దారుణ హత్య

పూజ ముగించుకొని వస్తుండగా కొడవలూరు వద్ద కొందరు కత్తితో దాడి చేయడంతో హాసిని మృతి చెందింది.

By Kalasani Durgapraveen
Published on : 27 Nov 2024 8:15 PM IST

హిజ్రాల గ్యాంగ్ లీడర్ హాసిని దారుణ హత్య

పూజ ముగించుకొని వస్తుండగా కొడవలూరు వద్ద కొందరు కత్తితో దాడి చేయడంతో హాసిని మృతి చెందింది. హిజ్రాల గ్యాంగ్‌లీడర్ దారుణ హత్యకు గురైంది. నెల్లూరు పట్టణంలో హిజ్రాల నాయకురాలు హాసిని మంగళవారం రాత్రి పార్లపల్లిలోని ఓ ఆలయంలో దైవ దర్శనం కోసం వెళ్లింది. ఆమె ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హాసిని మరణ వార్త విన్న హిజ్రాలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story