తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యాత్రికుల సౌకర్యాల సముదాయం పద్మనాభ నిలయంలో బుధవారం మెట్ల గ్రిల్‌లోంచి జారిపడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడిని సాత్విక్‌గా గుర్తించారు. అతడు తన తల్లిదండ్రులతో కలిసి కడపలోని చిన్నచౌక్ నుంచి తిరుమలకు వచ్చాడు. వారు PAC-5 సౌకర్యాల సముదాయంలో లాకర్ సదుపాయాన్ని పొందారు. గురువారం సాయంత్రం వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
బుధవారం సాయంత్రం సాథ్విక్ తన అన్నయ్యతో కలిసి ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తూ మొదటి అంతస్తు నుంచి మెట్ల పక్కనే ఉన్న రైలింగ్ గ్రిల్‌పై నుంచి సాత్విక్ కిందపడి తలకు బలమైన గాయమైంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఇక తిరిగి రాడని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాత్విక్ తండ్రి శ్రీనివాసులు ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి దినసరి కూలీ. తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు