ప్రేమించుకున్నారు.. పెద్దలు పెళ్ళికి అంగీకరించకపోవడంతో!!

గుంటూరులో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.

By Kalasani Durgapraveen  Published on  18 Oct 2024 1:17 PM GMT
ప్రేమించుకున్నారు.. పెద్దలు పెళ్ళికి అంగీకరించకపోవడంతో!!

గుంటూరులో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.పెదకాకాని పోలీసు స్టేషన్ పరిధిలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. రైలు కింద పడి ప్రాణాలు వదిలారు. పెదకాకాని కి చెందిన మహేష్, నందిగామ మండలం రుద్రవరం కు చెందిన శైలుల పెళ్ళిని పెద్దలు అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే ట్రాక్ సమీపంలో బైక్ ను గుర్తించారు పోలీసులు.

శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. యాదవ్ పాలెం చెందిన దాన బోయిన మహేష్ (22) ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన శైలు(20) ప్రేమించుకున్నారు. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో దసరా సెలవుల తర్వాత పాఠశాలకు వెళ్లిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లోని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్‌లో లావణ్య(12) ఏడో తరగతి చదువుతోంది. ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన లావ‌ణ్య‌ ఊర్లో సంతోషంగా గ‌డిపింది. సెల‌వులు పూర్తి అవ్వ‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు స్కూల్లో విడిచి పెట్టి ఇంటికి వెళ్లారు. ఆ బాలిక తల్లితో తాను హాస్ట‌ల్‌లో ఉండ‌న‌ని ఇంటికి వ‌చ్చేస్తాన‌ని మారం చేసింది. త‌ల్లిదండ్రులు న‌చ్చ‌జెప్ప‌డంతో ఉండ‌టానికి ఒప్పుకుంది. త‌ల్లిదండ్రులు హాస్టల్లో విడిచి వెళ్లిన గంటకే విద్యార్థిని గ‌దిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డింది. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా లావణ్య మరణించిందంటూ వైద్యులు ధృవీకరించారు. స‌మాచారం అందుకున్న త‌ల్లిదండ్రులు, బంధువులు ఆసుప‌త్రి వ‌ద్ద‌కు చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు.


Next Story