Andhrapradesh: ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్‌ షాక్‌.. నలుగురు మృతి

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్‌ షాక్‌తో నలుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి.

By అంజి  Published on  4 Nov 2024 6:43 AM IST
Tragedy, East Godavari district, Four youth died, electric shock

Andhrapradesh: ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్‌ షాక్‌.. నలుగురు మృతి

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్‌ షాక్‌తో నలుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పాపన్న గౌడ్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీలు కడుతుండగా ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న కరెంట్‌ వైర్లు తగలడంతో కరెంట్‌ షాక్‌ కొట్టి నలుగురు మృతి చెందారు.

మృతులను గొల్ల వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. మరో బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story