అన్నమయ్య జిల్లాలో విషాదం.. శోభనం గదిలో వరుడు మృతి

Tragedy in Annamaiya district.. Groom dies in first night room. పెళ్లింట విషాదం జరిగింది. పెళ్లయిన కొన్ని గంటలకే ఓ వ్యక్తి చనిపోయాడు. మృతుడు తులసీ ప్రసాద్‌గా గుర్తించారు.

By అంజి
Published on : 14 Sept 2022 12:38 PM IST

అన్నమయ్య జిల్లాలో విషాదం.. శోభనం గదిలో వరుడు మృతి

వధువరూలు గతంలో ప్రేమించుకున్నారు. ఇంట్లోవారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే వారి సంసారం జీవితం చెదరడానికి ఎంతో సమయం పట్టలేదు. పచ్చని పందిరిలు, తోరనాలు వాడిపోకముందే.. తొలిరేయిలోనే వరుడు అనుమానాస్పద రితీలో మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పెళ్లింట విషాదం జరిగింది. పెళ్లయిన కొన్ని గంటలకే ఓ వ్యక్తి చనిపోయాడు. మృతుడు తులసీ ప్రసాద్‌గా గుర్తించారు. అన్నమయ జిల్లా మదనపల్లెలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టెంబర్ 12వ తేదీ సోమవారం నాడు తులసి ప్రసాద్, శిరీష వివాహం జరిగింది. తులసి ప్రసాద్, శిరీష కుటుంబ సభ్యులు మంగళవారం తొలి రాత్రి ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి తులసి ప్రసాద్‌ను నిద్ర లేపేందుకు శిరీష ప్రయత్నించగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.

వెంటనే శిరీష తులసి ప్రసాద్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. తులసి ప్రసాద్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాలేదు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. తులసి ప్రసాద్ మృతితో తులసి ప్రసాద్‌ మృతితో శిరీషను కుటుంబ సభ్యులు ఓదార్చలేకపోతున్నారు. తెలిసిన వివరాల ప్రకారం.. తులసి ప్రసాద్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తులసి ప్రసాద్‌కు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది.

Next Story