అర్థ‌రాత్రి టూరిస్ట్ బ‌స్సు బోల్తా.. 22 మందికి గాయాలు

Tourists Bus Overturn 22 injured at Srikakulam District.శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బ‌స్సు బోల్తా ప‌డింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2022 9:08 AM IST
అర్థ‌రాత్రి టూరిస్ట్ బ‌స్సు బోల్తా.. 22 మందికి గాయాలు

శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బ‌స్సు బోల్తా ప‌డింది. ఆదివారం అర్థ‌రాత్రి చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌లో 22 మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన కొంద‌రు విహార‌యాత్రం కోసం టూరిస్ట్ బ‌స్‌లో కేర‌ళ‌కు వెలుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండ‌లం పెద్ద‌తామ‌ర‌ప‌ల్లి స‌మీపంలోకి రాగానే జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌నే ఉన్న క‌ల్వ‌ర్టును ఢీ కొని బ‌స్సు బోల్తా ప‌డింది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

22 మంది గాయ‌ప‌డగా.. వారిని చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో శ్రీకాకుళం రిమ్స్‌కు త‌ర‌లించారు. ప్రమాద స‌మ‌యంలో బ‌స్సులో డ్రైవ‌ర్‌తో క‌లిపి 39 మంది ఉన్నారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తు కార‌ణంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మికంగా నిర్థార‌ణ‌కు వ‌చ్చారు.

Next Story