ఏపీలో ఎర్త్ అవ‌ర్‌.. రాత్రి 8.30 నుంచి 9.30 వ‌ర‌కు

Today Night earth hour in Andhra Pradesh.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌జ‌లు నేడు ఎర్త్ అవ‌ర్ ను పాటించాల‌ని రాష్ట్ర

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 26 March 2022 2:48 PM IST

ఏపీలో ఎర్త్ అవ‌ర్‌.. రాత్రి 8.30 నుంచి 9.30 వ‌ర‌కు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌జ‌లు నేడు ఎర్త్ అవ‌ర్ ను పాటించాల‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విశ్వభూషణ్‌ హరిచందన్ పిలుపునిచ్చారు. రాత్రి 8.30 నుంచి 9.30 వ‌ర‌కు రాష్ట్రంలోని అన్ని ఆఫీసులు ,ఇళ్ళల్లో అవసరం లేని చోట్ల విద్యుత్‌ లైట్లను ఆర్పివేయడం వేయాల‌ని కోరారు. భవిష్యత్‌ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. అత్యవసరమైతేనే లైట్లు, ఇతర పరికరాలు ఉపయోగించాలని వివరించారు. విజయవాడ రాజ్‌భవన్‌ ఆవరణలో అన్ని అనవసర లైట్లను ఆర్పివేస్తామని గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.

ప్రపంచ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, పునరుత్పాదక సహజ వనరుల వినియోగం స్థిరంగా ఉండేలా చూడడం, కాలుష్యాన్ని తగ్గించడాన్ని ప్రోత్సహించేందుకు ప్రతిఏటా మార్చి 26 వతేదీన ఎర్త్‌ అవర్‌ను పాటిస్తున్నారు. గ్రహం సహజ పర్యావరణం కాపాడటం, ప్రకృతికి అనుగుణంగా మానవులు జీవించే భవిష్యత్తును నిర్మించడం, వ్యర్థ వినియోగాన్ని భారీ ఎత్తున తగ్గించటానికి 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో లైట్స్ అవుట్ ఈవెంట్‌గా ఎర్త్ అవర్‌ను ప్రారంభించారు. 'ఎర్త్‌ అవర్‌'ను ప్రజా ఉద్యమంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నామని వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌(డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ఇండియా స్టేట్‌ డైరెక్టర్‌ ఫరీదా తంపాల్‌ తెలిపారు.

Next Story