ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపు రావడంతో ఆలయ భద్రతను పెంచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్కాన్ ఆలయ సిబ్బందికి అక్టోబర్ 27న ‘పాకిస్థాన్‌లోని ఐఎస్‌ఐకి సంబంధించిన ఉగ్రవాదులు ఆలయాన్ని పేల్చివేస్తారని’ ఈమెయిల్ వచ్చింది. బెదిరింపు ఇమెయిల్ గురించి అలర్ట్ అందుకున్న తర్వాత, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDS), డాగ్ స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆలయంలో తనిఖీ ఆపరేషన్ ప్రారంభించబడింది. అయితే ఆలయ ప్రాంగణంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా ఇతర అభ్యంతరకర వస్తువులు లభించలేదు.
ఆలయానికి బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అంతకుముందు అక్టోబర్ 26న తిరుపతిలోని రెండు ప్రముఖ హోటళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి , ఆ తర్వాత బీడీఎస్, స్నిఫర్ డాగ్‌ల ద్వారా క్షుణ్ణంగా శోధించిన తర్వాత పోలీసులు బూటకపు బెదిరింపులుగా నిర్ధారించారు. అంతకుముందు తిరుపతిలోని మరో మూడు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిని కూడా భద్రతా దళాలు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత బూటకపు బెదిరింపులుగా ప్రకటించాయి.