తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) అధికారిక వెబ్‌సైట్ పేరు మరో సారి మారింది. ఇప్పటి వరకు tirupatibalaji.ap.gov.inగా ఉండగా.. ఇప్పుడు ttdevasthanams.ap.gov.inగా మార్చుతున్నామని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. 'వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌సైట్, వన్ మొబైల్ యాప్'లో భాగంగా బుకింగ్ వెబ్‌సైట్‌నూ మార్చామన్నారు. తిరుమల పుణ్యక్షేత్రానికి సంబంధించి వెబ్‌సైట్ పేరు మార్పును భక్తులు గమనించాలని టీడీపీ భక్తులను కోరింది.
శ్రీవారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించేలా అధికార వెబ్‌సైట్ పేరు మార్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. ఇక నుంచి ఆన్‌లైన్ బుకింగ్స్ కోసం కొత్త వెబ్‌సైట్‌నే ఉపయోగించాలని సూచించింది. ఇదిలా ఉంటే.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 16న పార్వేట, గోదాపరిణయోత్సవాల కారణంగా స్వా మివారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సంక్రాం తిని పురస్కరించుకొని తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో 14న భోగితేరు, 15న సంక్రాంతి తిరుమంజనం, 16న గోదాకల్యాణం నిర్వహిస్తారు.