రికార్డు స్థాయిలో తిరుమల వెంకన్న హుండీ ఆదాయంతిరుమల వెంకన్నకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. ఇటీవల కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా ఆదాయం తగ్గిపోయింది. అన్‌లాక్ తర్వాత సర్వదర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో భక్తుల సంఖ్య కూడా పెరిగింది. అయితే లాక్‌డౌన్ తర్వాత రికార్డు స్థాయిలో ఆదాయం రావడం ఇదే మొదటి సారి. దీనికి తోడు దీపావళి పండగ, కార్తీకమాసం కావడంతో భక్తుల సంఖ్య పెరిగిపపోయింది. అలాగే తిరుమల వెంకన్న హుండీ ఆదాయం కూడా పెరిగింది. శుక్రవారం శ్రీరవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య పెరిగింది. హుండీలో రూ.3.26 కోట్ల మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. శుక్రవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఓ అజ్ఞాత భకక్తుడు స్వామివారికి రూ.1.5 కోట్లు కానుకగా సమర్పించుకున్నాడు.