Andhrapradesh: నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు

నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డిజాస్టర్‌ మేనెజ్‌మెంట్‌ అథారిటీ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

By అంజి
Published on : 9 April 2025 6:47 AM IST

Thunderstorms, Andhra Pradesh, APSDMA, Rain Alert

Andhrapradesh: నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు

నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డిజాస్టర్‌ మేనెజ్‌మెంట్‌ అథారిటీ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఇది వచ్చే 12 గంటల్లో ఉత్తర వాయువ్యదిశగా, ఆ తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా వచ్చి ఆ తదుపరి 12 గంటల్లో మధ్యబంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడనున్నట్లు తెలిపారు. నేడు, రేపు అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందన్నారు. శుక్రవారం (11తేది) ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. చెట్లు కింద నిలబడరాదని సూచించారు.

అల్లూరి జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో తీవ్రవడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడు, వైఎస్సార్ జిల్లా మద్దూరులో 41.5°C, కర్నూలు జిల్లా కామవరం 40.7 C, పల్నాడు జిల్లా రావిపాడులో 40.6°C, ప్రకాశం జిల్లా దరిమడుగలో 40.6°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. 25 ప్రాంతాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించారు. నేడు వడగాలులు(25) వీచే మండలాల వివరాలు కింది పీడీఎఫ్‌లో ఉన్నాయి.


Next Story