ఉద్దృతంగా ప్రవహిస్తోన్న స్వర్ణముఖి నది.. ముగ్గురు గల్లంతు
Three people missed in a Swarnamukhi River.ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 12 Nov 2021 9:42 AM GMTఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. ఏర్పేడు మండలం గోవిందవరంలో స్వర్ణముఖి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. అయితే.. నది ఉద్దృతంగా ప్రవహిస్తున్నప్పటికి వేదాంతపురం 250 కాలనీ వద్ద దానిని దాటేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే.. ప్రవాహ ఉద్దృతి ముగ్గురు కొట్టుకుపోయారు. గల్లంతైన ముగ్గురిలో ఓ మహిళ కూడా ఉంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సాయంతో గల్లంతైన వారికి ఒడ్డుకు చేర్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
తిరుపతిలో బీభత్సం..
తిరుపతి నగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఇస్కాన్ రోడ్డులోని ఫారెస్టు కార్యాలయం, రుయా, ప్రసూతి, చిన్నపిల్లల ఆస్పత్రి ఆవరణల్లో చెట్ల కొమ్మలు విరిగిపడడంతో పలు కార్లు, ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. మధురానగర్, లక్ష్మీపురం, పద్మావతి పురం, కట్టకింద ఊరు ప్రాంతాల్లో మురికినీటితో కలిసిన వర్షపునీరు ఇళ్లల్లోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులుపడుతున్నారు. రుయా ఆస్పత్రిలోని ప్రధాన భవనంపై నుంచి నీరు లోపలికి చేరడంతో కొన్నివార్డులు, కార్యాలయ గదులు వర్షపునీటితో నిండిపోయాయి. దీంతో రోగులను వేరే వార్డులకు తరలించారు. చెర్లోపల్లి అండర్ బ్రిడ్జిలో రెండు ఆర్టీసీ బస్సులు నీటిలో చిక్కుకున్నాయి. పోలీసులు.. స్థానికుల సాయంతో ప్రయాణీకులను బస్సు నుంచి బటయకు తీసుకువచ్చారు.