Vijayawada: ప్లాట్‌ఫారమ్‌పైకి దూసుకొచ్చిన బస్సు.. ముగ్గురు మృతి

విజయవాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద సోమవారం ఉదయం 12వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పైకి ఎపిఎస్‌ఆర్‌టిసి లగ్జరీ బస్సు దూసుకొచ్చింది.

By అంజి  Published on  6 Nov 2023 10:27 AM IST
APSRTC Bus, Vijayawada, accident

Vijayawada: ప్లాట్‌ఫారమ్‌పైకి దూసుకొచ్చిన బస్సు.. ముగ్గురు మృతి 

విజయవాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద సోమవారం ఉదయం 12వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పైకి ఎపిఎస్‌ఆర్‌టిసి లగ్జరీ బస్సు దూసుకొచ్చింది. ఈ ఘటనలో బస్సు కండక్టర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ఘోర ప్రమాదంతో బస్టాండ్‌లో భయానక వాతావరణం నెలకొంది. బస్సు కండక్టర్‌ను గుంటూరు-2 డిపోకు చెందిన వీరయ్యగా గుర్తించారు. మృతి చెందిన వారిలో బాలుడు కూడా ఉన్నాడు. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఈ ఘటన జరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీస్ బస్సు పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో ప్రమాదానికి గురైంది. డ్రైవర్ రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడమే ప్రమాదానికి కారణం అని డిపో ఆర్ఎం చెబుతున్నారు.

Next Story