శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి కింద‌కు నీటి విడుద‌ల‌

Three gates of Srisailam Dam opened.ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వ‌ర‌ద నీటి ప్ర‌వాహం కొన‌సాగుతోంది. దీంతో శ్రీశైలం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2022 7:23 AM GMT
శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి కింద‌కు నీటి విడుద‌ల‌

ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వ‌ర‌ద నీటి ప్ర‌వాహం కొన‌సాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ వ‌ద్ద‌ నీటి మ‌ట్టం గ‌రిష్టస్థాయికి చేరుకోవ‌డంతో.. ప్రాజెక్టు మూడు గేట్ల‌ను శ‌నివారం తెరిచారు. అంత‌క‌ముందు ఏపీ జలవనరుల శాఖా మంత్రి అంబ‌టి రాంబాబు ప్రాజెక్టు వ‌ద్ద ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం ప్రాజెక్టులోని 6,7,8 గేట్ల‌ను 10 అడుగుల మేర ఎత్తి కింద‌కు నీటిని విడుద‌ల చేశారు. కాగా.. జూలై నెలలో గేట్లను తెర‌వ‌డం 12 ఏళ్ల‌లో ఇది మూడోసారి.


శ్రీశైలం ప్రాజెక్టులో గరిష్ట నీటి నిల్వ 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 202.04 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.50 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 1,27, 980 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ ఫ్లో 74,365 క్యూసెక్కులు ఉంది. కుడి, ఎడమ గట్ల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువన ఉన్న జూరాల నుంచి81 వేల క్యూసెక్యుల‌, సుంకేశుల నుంచి 31 వేల క్యూసెక్యుల వ‌ర‌ద నీరు వ‌స్తున్న‌ట్లు అధికారులు చెప్పారు.


Next Story