Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు వైద్యులు మృతి

అనంతపురం జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విడపనకల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు.

By అంజి  Published on  1 Dec 2024 4:59 AM GMT
doctors killed, road accident, Anantapur

Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు వైద్యులు మృతి 

అనంతపురం జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విడపనకల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో.. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు కాగా.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మంచుపొగ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. మృతులను బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు యోగేశ్, గోవిందరాయ, అమరేశ్ గుర్తించారు. వీరంతా హాంకాంగ్ విహారయాత్రకు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న కూలీల ఆటోను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలిలోనే ఇద్దరు మృతి చెందగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story